సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళుతున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ప్రతిపక్షలు ముఖ్యముగా ఏపీ మినహా అన్ని దక్షిణాది రాష్టాల ఎంపీలు లోక్‌సభలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రధాని మోడీ మ్యాజిక్ తో లోక్ సభలో 3 బిల్లులు పాస్ అవుతాయని ఎక్కువ శాతం మంది భావించినప్పటికీ మహిళా రిజర్వేషన్ల వేగవంతమైన అమలుకు ఉద్దేశించిన కీలక బిల్లు చుక్కెదురైంది. 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయింది. మహిళా బిల్లుతో పాటు రాష్ట్రాలలో ఎంపీలు , ఎమ్మెల్యేలు సంఖ్యను పెంచే ప్యూహంతో ప్రవేశ పెట్టిన మరో 2 బిల్లులను కూడా ప్రస్తుతానికి వెనక్కి తీసుకోక తప్పలేదు. కొత్త జనాభా గణనతో సంబంధం లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, మహిళా కోటాను వెంటనే అమలు చేయాలన్న ప్రతిపాదనను లోక్‌సభ తిరస్కరించింది. గత, శుక్రవారం (ఏప్రిల్ 17) రాత్రి జరిగిన ఈ ఉత్కంఠభరిత ఓటింగ్‌లో మొత్తం మూడింట 2 వంతుల మెజారిటీ కావలసి ఉండగా..మొత్తం 489 మంది ఎంపీలు పాల్గొన్నారు.బిల్లు ఆమోదం పొందడానికి ఎన్‌డీఏ ప్రభుత్వానికి 326 ఓట్లు అవసరం కాగా, కేవలం 278 ఓట్లు మాత్రమే అనుకూలంగా వచ్చాయి. 211 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు వీగిపోయింది. మరి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్లాన్ బి ఏమిటి అన్నది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *