సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్, ప్రభాస్(Prabhas) హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన హాలీవుడ్ స్థాయి అద్భుతం ‘కల్కి 2898 AD’ (Kalki). బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా1150 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ఈ చిత్రం, క్లైమాక్స్‌లో భైరవ పాత్రలోని కర్ణుడి అసలు స్వరూపాన్ని చూపించి ప్రేక్షకులను మహాభారత కాలానికి తీసుకొనిపోయారు. ప్రస్తుతం వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ ఎక్కడ వెనకాడకుండా, ఈ రెండో భాగాన్ని కూడాఈ ఏడాది చివరలో రిలీజ్ చేసేలా వేగంగా సిద్ధం చేస్తున్నారు.ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ ఫై కీలక సన్నివేశాలు చిత్రీకరణ పూర్తీ చేసారు. హైదరాబాద్‌లో ఈ మూవీ సీక్వెల్ కోసం ఒక భారీ సెట్‌ను నిర్మించారు.. మొదటి భాగం ముగింపులో వచ్చిన ట్విస్ట్‌లకు కొనసాగింపుగా, ఈ ఇంటర్వెల్ సీన్ కనివిని ఎరుగని స్థాయిలో..కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో హాలీవుడ్ నిపుణులు మేకింగ్ చేస్తున్నారు. ప్రముఖ హీరోలు అతిధి పాత్రలలో కనిపించనున్నారు. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ కలసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించే ఈ సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్. కల్కి సినిమా సీక్వెల్‌కు ‘కర్ణ 3102 BC’(Karna 3102 BC) అనే పేరును మేకర్స్ పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.
