సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణాలో ప్రభుత్వం తమ డిమాండ్స్ నెరవేర్చని కారణంగా నిరవధిక సమ్మెకు దిగిన టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలచిపోయాయి. అయితే, ఏపీ నుండి తెలంగాణ కు ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఒత్తిడి నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు మెట్రో రైళ్ల సంఖ్య, ఫ్రీక్వెన్సీ పెంచాలని నిర్ణయించారు. ఆర్టీసీ సమ్మె ముగిసేవరకూ 56 మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. మియాపూర్- ఎల్.బి.నగర్ కారిడార్‌లో 4 నిమిషాల 20 సెకన్ల విరామంతో, అలాగే నాగోల్- రాయదుర్గం కారిడార్‌లో 3 నిమిషాల 40 సెకన్ల విరామంతో రోజంతా గరిష్ఠంగా 56 రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. చివరి మెట్రో రైలు సర్వీస్ రాత్రి 11 గంటల తర్వాత కూడా పొడిగించేలా చర్యలు చేపట్టినట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు. గతంలో రాత్రి 10 గంటల తరువాత టికెట్స్ నిలిపివేసేవారు.
