సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆకివీడు పెదపేటలో పురాతన రామాలయం పునర్ నిర్మాణం కు శంకుస్థాపన ఈ మే నెల 3వ తేదీన ఆదివారం ఉదయం 7 గంటల 14 నిమిషాలకు నిర్వహిస్తున్నట్లు ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు ప్రకటించిన నేపథ్యంలో.. శ్రీ రామభక్తులు కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో ..గతంలో శ్రీరామ నవమి రోజు అదే ప్రాంతంలో జరిగిన దాడుల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎల్లుండి జరిగే ఈ కార్యక్రమానికి ఇప్పటి నుండే భారీ స్థాయిలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. హైకోర్టు లో దీనిపై పలువురు అభ్యన్తరాలు వ్యక్తం చేస్తూ పిల్ లు పెయ్యడం దానికి వాద ప్రతివాదనలు జరుగుతున్నా వేళా.. స్థానిక వైసీపీ అధికారంలో ఉన్నమునిసిపాలిటీ కౌన్సిల్ లో 20 మంది సభ్యులులో ఒక్కరు మినహా అందరు మెజారిటీ ఆమోదాన్ని తెలపడం.. ఇలా ఎన్నో పరిణామాలు చక చక జరిగిపోతున్నాయి. మరో ప్రక్క ఇప్పటికే ఆలయ భూమి చదును చెయ్యడం, దేవాలయా నిర్మాణానికి కృష్ణ శిలలు అక్కడికి చేరుకోవడంరామ భక్తుల నుండి కోటి రూపాయలు విరాళాలు సేకరించడం, పూర్తీ అయ్యాయి. ఇక శంకుస్థాపన తదుపరి రామాలయ నిర్మాణం ప్రశాంతంగానే జరుగుతాయని అన్ని కులమతాలుకు, రాజకీయాలకు అతీతంగా సహకరిస్తారని ‘రఘురామా’ అంటున్నారు.
