సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో యుద్ధ విరమణకు సంబంధించి ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. దీంతో మరల ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో , నేడు సోమవారం భారత దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. నేటి (మే 11) ఉదయం 10.30 గంటల సమయంలో విజయవాడ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,130కు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ధర రూ.220ల మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200ల మేర తగ్గి రూ.1,39,450కు పడిపోయింది. అయితే వెండి ధర మాత్రం పెరిగింది. క్రితం ముగింపుతో పోలిస్తే కిలో వెండి ధర రూ.5 వేల మేర పెరిగి రూ.2.85 లక్షల వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *