సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీ అక్కడే జూబ్లీ హిల్స్ లో నివాసం ఉంటున్న ఏపీ సీఎం చంద్రబాబు. డెప్యూటీ సీఎం పవన్ నివాసాలకు వెళ్లి కొద్దీ సేపు వారి కుటుంబ సభ్యులతో ఆహ్లదంగా గడిపారు. ఇదిలా ఉండగా నేడు, సోమవారం ఉదయమే దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన మొదలు పెట్టడం ఆసక్తి లేపుతుంది. నేటి ఉదయం హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశ మయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు.. విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్ట్‌లతోపాటు నిధుల కేటాయింపులపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అలాగే జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌లో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *