సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : ఆంధ్ర ప్రదేశ్ నుండి కేంద్రంలోని రాజ్య సభలో జూన్ 21న ఖాళీ అవుతున్న 4 స్థానాలకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో రాజ్యసభ సీట్ల సందడి మొదలైంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో టీడీపీ కి 2 స్థానాలు బీజేపీ1, జనసేనకు 1 సీట్లు కేటాయిస్తారని అంచనా. ఈనేపథ్యంలో . బీజేపీ పార్టీ ఏపీ అధ్యక్షుడు మాధవ్‌ను రాజ్యసభకు పంపే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. ఇక జనసేన నుండి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేని ని రాజ్యసభకు పంపుతారని భావిస్తున్నారు. ఇక 2 స్థానాలకు టీడీపీ నుండి తీవ్ర పోటీ నెలకొంది.కిలారు రాజేశ్, భాష్యం రామకృష్ణ, గల్లా, కంభంపాటి, వర్ల రామయ్య,తో పాటు ప్రస్తుత రాజ్య సభ సభ్యుడు సానా సతీశ్ మరోసారి అవకాశం కోసం ఎదురు చుస్తునారు.
