సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : రోహిణి కార్తె ఎండలతో రోళ్ళు బ్రద్దలు అవుతున్నా ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది.రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. అంతేకాదు రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలతో పాటు తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. మరో 10 రోజులలో కేరళను తాకే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, కోనసీమ యానాంలో నేటి సాయంత్రం నుండి , రేపు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులకు అవకాశముంది. అయితే పెద్ద ట్విస్ట్ ఏమిటంటే ఈ వేసవిలో ప్రక్క జిల్లాలలో ఎన్ని వర్షాలు కురుస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా లోవాతావరణం చల్లబడటం తప్ప ఒక్క వర్షం కూడా పడక పోవడం..గమనార్హం..
