సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని సంపూర్ణ స్వర్ణ అలంకారం చెయ్యటకు ఏర్పాటు చేసిన స్వర్ణమయం నిధికి నేడు, శనివారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు యిర్రింకి పద్మనాభం, కస్తూరి పేరు మీద వారి కుమారులు సత్యనారయణ శ్రీనివాస్ శ్రీ అమ్మవారికి సుమారుగా లక్ష పదిహేను వేలు రూపాయలు విలువ కల .8 గ్రాముల బంగారం కానుకగా అందచేసారు.వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం సిబ్బంది , ఆలయ ధర్మకర్తలు వారికీ శ్రీ అమ్మవారి ప్రసాదం ఫోటో అందించారు.
