సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్‌తో శాంతి చర్చల గురించి భారత్ లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో శుభవార్త తెలిపారు ..నేడు, ఆదివారం న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. . ‘మరికొన్ని గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త అందే అవకాశం ఉంది’ తాజాగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌తో శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని అని తెలిపారు. దీంతో హర్ముజ్ జలసంధి తెరుచుకొని అవకాశాలు అతి త్వరలోనే ఉన్నాయని సంకేతాలు వెలువడ్డాయి. కాగా, హోర్ముజ్ జలసంధిపై ఎవరి నియంత్రణా లేకుండా స్వేచ్ఛా రవాణాకు అవకాశం ఉండాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. కాగా, ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి పని చేస్తాయని ,భారత్, అమెరికా రెండూ ఉగ్రవాద బాధిత దేశాలేనని, ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి నడుస్తామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *