సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తనతో పెట్టుకొన్న అమెరికా ను మూడు సముద్రాలలో ముంచి లేపినంత పనిచేసిన ఇరాన్ యుద్ధ శైలికి ప్రపంచం నివ్వెరపోయింది. చివరకు అమెరికా నే ఇరాన్ తో ఒప్పందానికి అర్రులు ఛాచేలా ప్రపంచ వాణిజ్యాన్ని స్తంబింపచేసింది అయితే నేడు, ఆదివారం భారత్ తో సహా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధ వాతావరణాన్ని తగ్గించి, శాంతిని నెలకొల్పే దిశగా ఒక కీలక ఒప్పందం తాజగా నేడు, ఆదివారం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ ‘ఆక్సియోస్’ (Axios) ప్రకటించింది. 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire), హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ, ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణపై చర్చలు ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ‘హోర్ముజ్ జలసంధి(Strait of Hormuz)’ను ఎలాంటి టోల్ ఫీజులు లేకుండా 60 రోజుల పాటు తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. అక్కడ తాము అమర్చిన మైన్లను కూడా ఇరాన్ తొలగించనుంది. దీనికి ప్రతిగా అమెరికా ఇరాన్ రేవులపై ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేస్తూ, ఇరాన్ స్వేచ్ఛగా చమురు అమ్ముకునేందుకు కొన్ని ఆంక్షల నుంచి మినహాయింపులు ఇవ్వనుంది., అలాగే అణు కార్యక్రమాలను నిలిపివేయడానికి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. అయితే, దీనిపై ఇరాన్ అధికారిక వర్గాలు కొంత భిన్నమైన ప్రకటనలు చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *