సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ ను భారతీయులను అవమానకర పదజాలంతో పలుసారులు మాట్లాడిన అమెరికా అడ్జక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాత్రం’ అతి తెలివిగా’ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. ఇదిలా ఉండగా తాజగా నేడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా ఈ ఏడాది జరుపుకోనున్న 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో.. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం లో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆధ్వర్యంలో నేడు, సోమవారం జరిగిన ఈ వేడుకలో.. ట్రంప్ నేరుగా ఫోన్ కాల్ ద్వారా లైవ్‌లోకి వచ్చి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. భారత ప్రధాని మోదీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా గొప్ప నాయకుడు మాత్రమే కాదు.. నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. నేను మోదీకి చాలా పెద్ద అభిమాని అని అన్నారు. గతంలో కంటే ఇప్పుడు భారత్-అమెరకా దేశాలు చాలా దగ్గరయ్యాయని ట్రంప్ తెలిపారు. భారత్ ఏ అవసరం కోసమైనా.. సహాయం కోసమైనా 100 శాతం అమెరికాపై ఆధారపడవచ్చన్నారు. అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ట్రంప్ అన్నారు. భారత్ అభివృద్ధికి ఏది కావాలనుకుంటే అది దక్కుతుందని ట్రంప్ తెలిపారు.. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుందని వెల్లడించారు.
