సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం భీమవరంలో పాలకొల్లు కు చెందిన ప్రముఖ ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ జిల్లా కలెక్టరేట్ మరియు జిల్లా ఎస్పీ కార్యాలయాలకు తిరుగుతూ పలు పిర్యాదులు ఇస్తూ హల్ చల్ చేసారు. మీడియా తో మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందంటూ భీమవరం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్‌లో అనంత శ్రీరామ్ ఈ ఫిర్యాదు చేశారు. పాలకొల్లు సమీపంలోని యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తమ ఇంటి ముందున్న ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని కొందరు ఆక్రమించారంటూ ఆయన తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ స్థల వివాదం ప్రస్తుతం కోర్టులో ఉందని గుర్తు చేశారు అయితే ఆయన మీడియా ముఖంగా చెప్పకపోయినప్పటికీ ఈ స్థలం కోసం మాజీ ఎంపీ హరి రామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ తన తల్లిదండ్రులను బెదిరింపులకు గురి చేస్తూ.. వారిని మానసికంగా హింసకు గురి చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. ప్రముఖ కాపు నేత మాజీ మంత్రి, సినీ నిర్మాత హరిరామ జోగయ్య కుమారుడిపై అనంత శ్రీరామ్ పిర్యదు చెయ్యడం తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *