సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షల లీకులు, డేటా బేస్ మాయం కావడంపై సిబిఐ విచారణ జరగాలని మంత్రి లోకేష్ ను పదవి నుండి తొలగించాలనీ. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . నేడు, సోమవారం (మే 25) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు . సీఎం చంద్రబాబు ..మీరు నిర్వహించింది మెగా డీఎస్సీ నా? లేక ఉద్యో గార్థులను మోసం చేసిన దగా డీఎస్సీ నా?. పారదర్శకత ఎక్కడ ఉంది? పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం .. దీనిపై మీ సమాధానం ఏమిటి? గత మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డీఎస్సీ ని రద్దు చేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి , దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా? మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు ?అని ప్రశ్నించారు. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్లిస్టులను ఎందుకు దాచారు?టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు? సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? జిల్లా కలెక్టర్ కార్యా లయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు ? రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా?ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా?. ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి? దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. అని జగన్ జగన్ డిమాండ్ చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *