సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సొసైటీ డైరెక్టర్లు నేడు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కమిటీకి చైర్మన్ గా ఎమ్మెల్యే అంజిబాబు వ్యవహరిస్తున్నారు ఈనేపథ్యంలో నూతనంగా నియమితులైన డైరెక్టర్లతో ఎమ్మెల్యే అంజిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వాసుపత్రి క్షేత్ర స్థాయిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, వసతులను స్వయంగా పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించేలా ఆస్పత్రిలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 11 మంది సభ్యులతో అభివృద్ధి సొసైటీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, సభ్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆసుపత్రి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. దాతలను సమీకరించి ఆసుపత్రికి కావలసిన సదుపాయాలను సమకూర్చాలన్నారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సొసైటీ డైరెక్టర్లు యర్రంశెట్టి శివకృష్ణ, సుంకర దాసు, కొనాల దొర్కా రాణి లను అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో, డాక్టర్ గోవిందబాబు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎఎంసి చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు.
