సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం రోజులుగా పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా లో సైతం భానుడి ప్రతాపానికి రోహిణి కార్తె తోడయ్యింది. పలుమారులు జిల్లా వ్యాప్తంగా గత దశాబ్దంగా కనివిని ఎరుగని ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో 45 -47 డిగ్రీల వరకు నమోదైంది. దానికి తోడు ఎక్కడ వర్షాలు పడిన ఇక్కడ చుక్క పడటం లేదు. జూన్ 1వరకు గోదావరి నీరు విడుదల చెయ్యరు కాబ్బటి పంట కాలువలు ఎండిపోయి బురద వాసన వస్తున్నాయి. నీరు లేక , ఏసీలు వాడకం ఎక్కువై వాతావరణంలో వేడి పెరిగిపోయింది.ఇప్పటికే భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, గణపవరం ప్రాంతాలల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన సెంటర్లలో వ్యాపారాలు ఎండ ప్రతాపానికి సాయంత్రం 5 దాటితే కానీ సాగడం లేదు. ఉదయం 10గంటల నుంచి తీవ్ర వడగాడ్పులకు, రోడ్లు ఆద్దంలా మెరిసిపోవడం చూసి ప్రజలు అత్యవసర పని ఉంటే తప్ప జనం బయటకు రావడం లేదు. దీనికి తోడు పలు ప్రాంతాలల్లో భీమవరం లో సైతం అప్రకటిత విద్యుత్ కోతతో ప్రజలు అపసోపాలు పడుతున్నారు. వడగాడ్పు, ఉక్కబోతతో అల్లాడిపోతున్నారు. భీమవరం పరిసర ప్రాంతాలలో వడదెబ్బకు పలువురు మరణించిన ఘటనలు కూడా జరిగాయి..కుక్కునూరు మండలంలో 47.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. చింతలపూడి 46.9, భీమడోలు, ఉంగుటూరు 46.7,గణపవరం కొయ్యలగూడెం 46.6, సెంటీ గ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
