సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు రాష్ట్రాలను కుదిపివేస్తున్న.. ‘జగన్ ను కట్టడి చెయ్యాలంటే లోపల వేసెయ్యాలని’ పవన్ అమిత్ షా ను కోరితే.. ఆయన జగన్ మాకు లాంగ్ రిలేషన్ ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్, మీరు ఇటువంటివి తేవద్దు అని చెప్పినట్లు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల నేపథ్యంలో.. నాగేశ్వర్ పై ఏపీలో 3 కేసులు పెట్టిన నేపథ్యంలో తలెత్తిన వివాదంపై, తెలంగాణ వాదులు,మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ కేంద్ర నేతలు భగ్గున మండి పడుతున్నారు. దీనిపై బీజేపీ సహకారం లేకపోవడం ఇతర వివాద అంశాలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత సోమవారం సాయంత్రం జనసేన పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడిన ఆయన..”నేను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి? ఇలాంటి ప్రచారాలపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదు? వైఎస్సార్‌సీపీ (YCP) నాయకుడు (జగన్ )జైలుకెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను? అలా అయితే జనసేన ఎదుగుతుందా? నేను అమిత్ షాను కలిసింది కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే.” అని స్పష్టం చేశారు. అయితే ప్రొపెసర్ వ్యవహారంలో కులభావన రాష్ట్ర భావన తో విమర్శలు వస్తున్నాయి. నేను ఎప్పడైనా కుల భావనతో రాజకీయాలు చేసానా ?”నేను ఎప్పుడైనా కుల నాయకుడినని చెప్పానా? అని ప్రశ్నించారు. సమాజంలో కులాలను రెచ్చగొట్టే మనస్తత్వం ఎవరికీ మంచిది కాదని అన్నారు. సొంత పార్టీ నాయకుల తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పదవులు వచ్చిన తర్వాత చాలా మంది జనసేన నాయకులు మెత్తబడిపోయారని, అలాంటి నాయకులు జనసేనకు అవసరం లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *