సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో నిర్వహించిన మహానాడులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని టీడీపీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రకటించటం చరిత్రాత్మక నిర్ణయమని దీంతో దేశంలో అందరికన్నా ముందుగా మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే పార్టీగా టీడీపీ గుర్తించబడిందన్నారు. ఇక స్థానిక పరిణమాలు ప్రస్తావిస్తూ.. ఆకివీడు రామాలయం విషయంలో సుప్రీంకోర్టు లో జడ శ్రవణ్ కుమార్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. .అయితే ఆకివీడులో ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వస్తుందన్నారు. ఉండి నియోజకవర్గంలో అన్ని ప్రార్ధన మందిరాలలో లౌడ్ స్పీకర్లు సమూలంగా నిర్మూలించామని ప్రకటించారు..ఇంకా స్థానిక ప్రజలకు పార్ధన మందిరాలు వద్ద లేదా దేవాలయాలు వద్ద లౌడ్ స్పీకర్ల వల్ల ఇబ్బంది ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఈ ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే.. వారిపై తాము చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే తెలుగువీర లేవరా వెబ్‌సైట్ కూడా రెండు రోజుల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఓట్ల రాజకీయంకు దూరంగా న్యాయం చేయడమే ఈ తెలుగు వీర లేవరా ఫారం ముఖ్య ఉద్దేశమని వివరించారు.
