సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని, ప్రభుత్వం అందజేసే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం 58 మంది లబ్ధిదారులకు రూ 25,63,245 ల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందించి మాట్లాడారు. గడిచిన 20 నెలల్లో భీమవరం నియోజక వర్గంలో ఇప్పటి వరకు 816 మందికి రూ 6,35,66,244 ల చెక్కులను అందించామన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా పేదలు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
