సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక బివి రాజు పార్కు దగ్గర స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద జయంతి వేడుకలను నేడు , గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ తోటి సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సౌరభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకుంటున్నారని భీమవరం నియోజకవర్గంలోని అన్ని ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఈరోజు పేద ప్రజలకు చీరలు, నిత్యవసరాల ఇతర సామాగ్రి పంపిణీ సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అన్న ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ నియోజకవర్గంలోని 11 క్లస్టర్లో మహానాడు వేడుకలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నామన్నారు. పట్టణ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు మద్దుల రాము ఆధ్వర్యంలో పేదలకు వస్త్రాలు పంపిణి చేసారు. పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
