సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణీల వల్ల ప్రచండ ఎండలతో పాటు వాటికీ ఉపశమనంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం, అల్పపీడన పరిస్థితుల కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ‘జాంగ్మీ’ తుపాను రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తాజగా తెలిపారు. ఈ తుపాను ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరో ప్రక్క సుమారు 79 మండలాల్లో వేడిమితో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం లక్షద్వీప్ ప్రాంతానికి చేరుకున్నాయి. జూన్ 3 లేదా 4 తేదీల్లో ఇవి కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఆ తర్వాత క్రమంగా విస్తరిస్తూ జూన్ 5 నుంచి 12వ తేదీ మధ్యన క్రమంగా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రుతుపవనాల వల్ల వచ్చే మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
