సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ బాటిల్స్ కొత్త పరిమాణంలో రానున్నాయి. ప్రస్తుతం 90, 180, 375, 750,1000 ఎంఎల్ లీటర్ బాటిల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇకపై అన్ని వర్గాల కు అందుబాటులో లిక్కర్ అమ్మకాలు మరింత పెంచే దిశగా ఇప్పుడు కొత్తగా 150, 200 ఎంఎల్ పరిమాణంతో సీసాలు తయారు చేయనున్నారు. ఈ మేరకు ఏపీప్రభుత్వం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు రాష్ట్రంలో మద్యం షాపులు, బార్ల దగ్గర ఆయా బ్రాండ్ బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాటును నిషేధించారు. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు, అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేశామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.త్వరలోనే మార్కెట్‌లోకి కొత్తగా 150 ఎంఎల్, 200 ఎంఎల్ పరిమాణంలో మద్యం బాటిళ్లను తీసుకురానున్నారు.
