సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రత మళ్లీ పెరిగిపోయాయి. వర్షాలు మాట దేవుడు ఎరుగు ఎండలు తట్టుకోలేక సామాన్య పేద ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.చిన్నారులు ఉడుకు జ్వరాలు వడ దెబ్బ పాలవుతున్నారు.జిల్లా వ్యాప్తగగా 42 డిగ్రీలకు తగ్గకుండా ఎండలకు తోడు ఇళ్లలో ఏసీలు కూలర్లు తో విద్యుత్తూ వినియోగం ఎక్కువ కావడంతో విద్యుత్తూ శాఖ అనధికార కోతలు విధిస్తుండటం తో ప్రజలు తీవ్ర అసహనంపై లోను అవుతున్నారు. జిల్లా కేందం భీమవరంలో సైతం ప్రతి రాత్రి అర్ధగంట నుండి 3 గంటలు వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తుండటం ఆందోళన చెందుతున్నారు. భీమవరం పరిసర ఆక్వా చెరువుల్లో నీరు వేడెక్కి ఆక్సిజన్ లోపించి చేపలు, రొయ్యలు నీటిపై తేలాడుతూ మృత్యు వాత పడుతున్నాయి. ఇక వర్షం పడితే రాత్రి 3 గంటల తరువాతే కరెంటు.. ఇది పరిస్థితి. రోహిణి కార్తె తరువాత కృత్తిక కార్తెలో నమోదైనట్టు గత గురువారం, నేడు శుక్రవారం ఉదయం 8గంటల నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగి వడగాల్పులు వీస్తున్నాయి. జిల్లాలో రహదారులు మధ్యాహ్నం సమయంలో నిర్మానుష్యంగా మారాయి. నేడు జూన్ 5న పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్రకరమైన వేడిగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీచేసింది.
