సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖపట్నంలోని నోవాటెల్‌ హోటల్‌లో ప్రారంభమైన ‘సముద్ర ఆహార ఉత్పత్తులు, ఎగుమతుల’ రెండు రోజుల జాతీయ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, నెల్లూరును కలుపుతూ ఆక్వా కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రపంచంలోని ప్రతి వంట గదికీఆంధ్రప్రదేశ్‌ సముద్ర ఆహార ఉత్పత్తులను అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారుకాకినాడలో పాత ఫిషింగ్‌ హార్బర్‌ను రూ.72 కోట్లతో ఆధునికీకరించడానికి ఆయన అంగీకరించారన్నారు. అమెరికా గత ఏడాది టారిఫ్‌లు పెంచడం వల్ల భారతదేశానికి మేలే జరిగిందని సీఎం వ్యాఖ్యానించారు. దానివల్ల కొత్త మార్కెట్లు ఎక్కడున్నాయో తెలిసిందని, ఎగుమతులు కూడా పెరిగాయని తెలిపారు. దేశంలో రొయ్యల ఉత్పత్తుల్లో 66 శాతం ఏపీ నుంచే ఉన్నాయని, రాష్ట్రంలో మెగా సీఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కుల ఏర్పాటుకు సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. క్వాలిటీ, సస్టెయినబులిటీ, ట్రేసబులిటీ, ఇన్నోవేషన్‌, జీరో పొల్యూషన్‌…అనేవి ఆక్వా రంగంలో చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *