సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక (SPIEF)లో మాట్లాడుతూ .. తమ మిత్ర దేశం భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి రష్యా ఎప్పుడు గట్టి మద్దతుఉంటుందని తెలిపారు. ఆయన (అమెరికా ?”) నుద్దేశించి మాట్లాడుతూ.. ఆంక్షల ద్వారా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ఏ ప్రయత్నమైనా తిరగబెడుతుందని, భారత్ ను తక్కువ అంచనా వేయవద్దని, సార్వభౌమ దేశాలు తమ రక్షణ, ఆర్థిక భాగస్వాములను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలని పుతిన్ నొక్కి చెప్పారు. .రష్యాతో సంబంధాలపై భారత్ కు బాహ్య ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్ ప్రధాని మోదీ నాయకత్వంలో తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే స్థిరంగా వ్యవహరించిందని, భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగిస్తుందని పుతిన్ అన్నారు. ‘భారత్ ఎల్లప్పుడూ ఒక సార్వభౌమ దేశంగానే వ్యవహరిస్తుంది.అని పుతిన్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *