సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో గతంలో నియమించిన లక్షలాది వాలంటీర్లు ను కూటమి ప్రభుత్వం వచ్చాక తీసివేయడంతో ఆ పనులు కూడా సచివాలయం ప్రభుత్వ సిబ్బందిపై పడి అధిక పని భారంతో ఇప్పటికే వారు రాష్ట్ర వ్యాప్తంగా వారు ఆందోళనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కర్నూలులో అధికారుల ఒత్తిడితో వీఆర్వో బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. కర్నూలు నగరంలోని 30వ సచివాలయంలో గ్రేడ్‌-2 వీఆర్వోగా పనిచేస్తున్న మహమ్మద్‌ హుస్సేన్‌(49) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు వెంకాయపల్లెలో నివాసం ఉంటున్న ఆయన, తన ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నాడు. సూసైడ్‌ నోట్‌ లో తన ఆత్మహత్యకు కర్నూలు అర్బన్‌ తహసీల్దార్‌ రవికుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ధనుంజయ కారణం అని రాశారు. గతంలో ఆయన వెన్ను ముక్క కు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఎక్కువ సేపు నడవడం, నిలబడటం ఇబ్బందిగా ఉంటోందని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నారు. అయినప్పటికీ ఇంటింటికి తిరగాల్సిన బీఎల్‌వో బాధ్యతలను తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్లు హుస్సేన్‌ లు కనికరించలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన హుసేన్‌ శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వీఆర్వో మృతదేహంతో కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేశారు.కలెక్టర్ హామీతో వారు ఆందోళన విరమించి నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *