సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఆనంద పంక్షన్ హాల్లో నేడు, గురువారం శ్రీకాకతీయ మెరిట్ స్కూల్ విద్యార్థులకు యాన్యువల్ అకడమిక్ ఎక్స్ లెన్స్ అవార్డులను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ,, క్రమ శిక్షణ గల విద్యతోనే జీవితంలో అత్యున్నత స్థానాలు సాధించవచ్చని, విద్యార్థులు కష్టపడి చదివితే పెద్ద లక్ష్యాలను చేరుకోగలరని ,జిల్లా స్థాయిలో భీమవరం కాకతీయ విద్యార్థులు 594 మార్కులతో ఉత్తమ ఫలితాలను సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. స్కూల్ కరస్పాండెంట్ అక్కినేని కృష్ణ కిశోర్ మాట్లాడుతూ.. గత మూడేళ్లో పదో తరగతి ఫలితాల్లో కాకతీయ అద్భుతమైన ఫలితాలను సాధించిందని, 2024లో 590, 2025లో 592, 2026 లో 594 మార్కులతో ఉత్తమ ఫలితాలను సాధించారని అన్నారు. అనంతరం మొదటి మూడు స్థానాలను సాధించిన విద్యార్థులకు రూ 10 వేలు, రూ 5 వేలు, రూ 3 వేలు చొప్పున నగదు ప్రోత్సాహంతో మెరిట్ అవార్డులను అందించారు.
