సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో సుమారు 4 దశాబ్దాలుగా సాధారణ కార్యకర్త స్థాయి ,మునిసిపల్ కౌన్సిలర్ నుండి కేంద్ర మంత్రిగా ఎదిగినప్పటికీ, తన మూలాలను మరువక తోటి కార్యకర్తలకు అండగా నిలవాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సంకల్పించారు. దానిలో భాగంగా . పార్టీ కోసం నిస్వార్థంగా సేవలందించిన కార్యకర్తలు కష్టాల్లో ఉంటే, వారి బాధ్యత తనదేనని ముందుకొచ్చి సొంత ఖర్చులతో ఇళ్ల నిర్మాణం చేపట్టి కార్యక్రమం ప్రారంభించడమే కాదు వారి ఇంటి నిర్మాణంలో తన వంతు పని కూడా చేసి తనదయిన ముద్ర వేస్తున్నారు. గొల్లలకోడేరు గ్రామానికి చెందిన మెట్ట లక్ష్మీనరసింహ శ్రీనివాస్ దురదృష్టవశాత్తు ఆయన కరోనా సమయంలో మృతి చెందడంతో కష్టాలలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం వారికి ఒక ఇంటిని నిర్మిస్తునారు .అదేవిధంగా కొండేపూడి గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ కార్యకర్త రామారావు మధ్యలో ఆగిపోయిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. నేడు, గురువారం ఈ రెండు ఇళ్లకు సంబంధించిన స్లాబ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్వయంగా అక్కడికి చేరుకుని పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. స్లాబ్ పనుల్లో శ్రమదానం కూడా చేసి ఉన్నత పదవులు వచ్చినా గతాన్ని, మరువని నేతగా నిరూపించుకొన్నారు.
