సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వరుస భూకంపాలు వెనెజువెలాలో ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అలాగే వేల మంది ఆచూకీ ఇప్పటికీ లభించడం లేదు. ఇప్పటికి శిధిలాలు తొలగించలేకపోతున్నారు.కూలిపోయిన భారీ భవంతుల ముందు వారి కుటుంబీకులు బంధువులు లోపల జీవించి ఉన్నవారి కోసం బిగ్గరగా అరుస్తూ కన్నీటి పర్యంతం అవుతున్న విషాద దృశ్యాలు కోకోల్లలు.. సెకెన్ల వ్యవధిలో సంభవించిన ఈ భూకంపాల కారణంగా ఇప్పటివరకు 250 మంది చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మరో 4300 మంది గాయాలపాలైనట్టు తెలిపారు అయితే ఈ భూకంపాల వల్ల గల్లంతైన వారి సంఖ్య 41 వేలకు పైగా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు,.. గల్లంతైన వారి వివరాలను గుర్తించేందుకు ప్రత్యేక ఆన్లైన్ ట్రాకింగ్ వ్యవస్థను కూడా వినియోగిస్తున్నారు. వేల మంది ఆచూకీ లేకపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలాలను తొలగించడానికి చాలా సమయం పడుతోందని తెలిపారు.
