సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలలో .. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు రోడ్ల అభివృద్ధిపై మాట్లాడారు. భీమవరం – కాళీ పట్నం రహదారి పనులకు నిధులు మంజూరు చేయాలని, భీమవరం నియోజకవర్గంలో అతి ప్రధానమైన రహదారులను పూర్తి చేయాలని వీరవాసరం మడుగు పోలవరం, కాళీపట్నం రోడ్ల పనులకు నిధులు మంజూరు చేయాలని అర్ అండ్ బి శాఖమంత్రిని కోరారు. వీరవాసరం – నౌడూరు – మడుగు పోలవరం గ్రామంలో 16 ఏళ్ల క్రితం రోడ్లు వేశారని, ఇప్పటి వరకు కొత్త రోడ్లు వేయలేదని, ఆ గ్రామంలోని రోడ్ల పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *