సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానేర్ ఫై కమల్ హాసన్ నిర్మాతగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ధర్మన్’. ఈ చిత్రంలో రజనీకాంత్ నిజాయితీపరుడైన డాక్టర్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో రజనీ కాంత్ తో తలపడే శక్తిమంతమైన నెగటివ్ షేడ్స్ ఉన్నమెయిన్ యువ విలన్ పాత్ర కోసం టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని ఎంపిక చేసినట్లు సమాచారం. రజనీ కూతురిగా నటిస్తున్న శ్రీలీలకు జోడీగా కనిపిస్తూనే, రజనీకాంత్‌తో ఢీకొట్టే సన్నివేశాల్లో రామ్ కనిపించనున్నారట. సంక్రాంతి కానుకగా రానున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ ఆసక్తి రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *