సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల లో నేడు శుక్రవారం (జూన్ 26) తెల్లవారుజామున అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదంజరిగింది.. మాచర్ల పట్టణ సమీపంలోని నగరవనం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని, వేగంగా దూసుకొచ్చిన తుఫాను వాహనం వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో వాహనం డొక్కు డొక్కు అయ్యిపోవడంతో దానిలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.బాధిత కుటుంబం హైదరాబాద్ చెందినవారు ..వారు ప్రకాశం జిల్లాలోని కనిగిరి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.
