సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు ఇండస్ట్రీ లో చాల కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నా యువ నటుడు సత్యదేవ్ కథానాయకుడుగా, సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన చిత్రం ‘రావు బహదూర్’. గతంలో కంచెర్ల పాళెము, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన చిత్రమిది. వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండో చిత్రం కావడం, గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ హాలీవుడ్ తరహా ప్రయోగాత్మక సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం కధ విషయానికి వస్తే.. 1960-90 సమయంలో కధ జరుగుతుంది. ఓ రాజవంశంలో .భువన వంశానికి చెందిన రాజు రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్). దేశాలు తిరుగుతూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు. తండ్రి మరణం తర్వాత ఇంటి చెంతనే ఉంటాడు. కొన్నాళ్లకు అనారోగ్యంతో మంచాన పడతాడు. నెలలు మాత్రమే అతను బతికుంటాడని డాక్టర్లు చెబుతారు. నిత్యం తాగుతూ పిచ్చి పట్టి రోజుకు ఒకలా ప్రవర్తిస్తుంటాడు. అందుకు కారణం చిన్నతనంలో చనిపోయిన రామప్ప చిన్న కుమారుడు కుసుమప్ప. అతను తనకు పుట్టిన వాడా? కాదా? అన్నది రామప్ప అనుమానం.ఫైనల్ గా విచిత్ర భ్రమలు తో అతని జీవితం ఎలా ముగిసింది అన్నది కథ. . ఇక ప్రేక్షకుడి కి సినిమాలో అసలు కథలోకి వెళ్లడానికి దాదాపు 40 నిమిషాల సమయం పట్టింది. ఫస్టాఫ్ మొత్తంలో చెప్పుకోదగ్గ విషయం ఏదన్నా ఉందీ అంటే సత్యదేవ్ అద్భుత నటన మాత్రమే. ఇక సెకండాఫ్ కాస్త ట్రాక్ లోకి వస్తుంది. సెకెండాఫ్ ఫర్వాలేదు. కథలోని సెటైర్స్ అక్కడక్కడా నవ్వించాయి. ఫైనల్ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది దర్శకుడు తీసుకున్నది మంచి పాయింటే అయినా ట్విస్ట్ లు ఇచ్చేసి కథను నడపడం సినిమా అందరికి నచ్చాలని లేదు. సత్యదేవ్ కి స్నేహితుడు, డాక్టర్ గా నటించిన వికాస్ ముప్పాల ఫర్వాలేదని పించారు. హీరోయిన్ గా దీపా థామస్ కనిపించింది కాసేపే అయిన నటనలో అదరగొట్టింది. దర్శకుడు వెంకటేశ్ మహా కాసేపు తెరపై మెరిశారు. ఆ పాత్రతో మెప్పించారు. . సినిమా ఎక్కువ శాతం ఒకే ఇంట్లో జరిగింది. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ బాగుంది. స్మరణ్ సాయి సంగీతం కూడా ఓకె.
