సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కడప జిల్లా చక్రాయపేట మండలం, నాగులగుట్టపల్లిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ సమయంలో టీడీపీ కి జనసేన క్యాడర్ కు జరిగిన ఉద్రిక్తతలు నేపథ్యంలో రామాంజనేయులు అనే జనసేన కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు. దీంతో భౌతిక కాయాన్ని రోడ్డుపై ఉంచి జనసేన కార్యకర్తలు ధర్నా చేసి ఆందోళన చేపట్టారు. పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి బెదిరింపుల కారణంగానే ఆయన చనిపోయాడని, చక్రాయపేట మండల టీడీపీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి కూడా దీనికి మరో కారకుడని జనసైనికులు ఆరోపించారు. .అయితే రామాంజులు మృతికి జనసేన నాయకులే కారణమని డీఎస్పీ ఆరోపించారు. అయితే పోలీసుల అసమర్థత కారణంగానే, వీరాంజనేయులు మృతి చెందాడని, తమ సర్పంచ్ అభ్యర్థిని స్క్రూటినీకి రాకుండా అడ్డుకుంటున్నారని ఎన్ని సార్లు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ వాదించడంతో సుంకర శ్రీనివాస్, డీఎస్పీ మురళి నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా సుంకర శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. రామాంజనేయులు మృతదేహం చూపిస్తూ.. తన చెప్పుతో తానే కొట్టుకొంటూ జనసేన రాజంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ కోనిశెట్టి హరి రాయల్ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు ఈ వీడియో భారీ స్థాయిలో వైరల్ అయ్యింది. ‘పవన్ కళ్యాణ్ గారు చూడండి.. మీరు చేస్తున్న రాజకీయం. మా వాణ్ని చంపేశారు, నా బూటుతో నేను కొట్టుకుంటున్నా. బీటెక్ రవికి స్క్రూటినీ హాల్లో ఏం పని? బీటెక్ రవి చేసిన హత్య ఇది. మేం అందరం చనిపోవాలా? జనసేన అధికారంలో లేదా?జనసేన వాళ్లకు చంపేసి శవాలను చంద్రబాబు కు బహుమతిగా ఇస్తావా.? అని హరి రాయల్ ప్రశ్నించారు.
