సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (RRR) నేడు, శనివారం భీమవరం పట్టణ శివారు పెదమిరం లోని తన కార్యాలయంలో చేసిన మీడియా సమావేశంలో సొంత కూటమి పార్టీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. ఇటీవల ఆకివీడు రామాలయం పునర్ నిర్మాణం నేపథ్యంలో తనపై విఫల దాడి.. అన్ని మతాల పార్దన మందిరాలపై మైకులు నిషేదించిన దరిమిలా మతం మారిన దళితులఫై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును తాను నియోజకవర్గంలో అమలు పరుస్తుంటే.. తనకు వస్తున్నా బెదిరింపులకు రాష్ట్ర ప్రభుత్వము చట్టపరంగా సహకారం లేదని ఆందోళన వ్యక్తం చేసారు.. తన నాలుక కోస్తామని, ప్రత్యర్దులు బెదిరిస్తున్నా రాజ్యాంగ పదవిలో ఉన్న తనకు రక్షణ కల్పించరా?తనను బెదిరించిన జడ శ్రవణ్ కుమార్ ఫై తన నియోజకవర్గంలో కేసు నమోదు అయిన ఇప్పటికి అరెస్ట్ చేయలేకపోయారని, కనీసం ఆయనపై చార్జిషీట్ కూడా పెట్టలేకపోయారని ఇది నాకు బాధ కలిగిస్తుంది. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పులను గౌరవించాలని నేను ఇక్కడ చర్యలు తీసుకొంటుంటే కొందరు చర్చలకు మైకులు పెట్టండి అని సవాల్ విసురుతున్నారని అవి ఇక్కడ సాగవని, ఏడాది పాటు జైలులో పెట్టిస్తాను అని హెచ్చరించారు. మమ్మలిని అడ్డుకొంటే నిన్ను అక్కడ కోస్తా ఇక్కడ కోస్తా అంటూ అవమానిస్తుంటే కనీసం వారిపై చర్యలు తీసుకొంటున్నట్లు అయిన ‘ఎదో’ జరగాలి కదా? మొన్న వైసీపీ మాజీ మంత్రి, సీఎం ను ఎదో అన్నాడని అరెస్ట్ చెయ్యలేదా?ఇక్కడ నన్ను చంపుతామని బెదిరిస్తున్న పట్టించుకోరా?ఒక వ్యక్తి చట్టం ఉల్లంఘిచి బరితెగించి మాట్లాడితే, అతనిపై చర్యలు తీసుకోలేని స్దితిలో ప్రభుత్వం ఉందని ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడే అని నా పదవి గౌరవం కాపాడలేని ప్రభుత్వం ఎందుకు? అన్ని రఘురామా ఆగ్రహం వ్యక్తం చేసారు.
