సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం తాలూకా మోగల్లు గ్రామంలో జన్మించిన స్వతంత్ర సమర యోధుడు.. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు ఖ్యాతి తెలుగునాట తో పాటు దేశం యావత్తు పాకింది. నేడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి నేపథ్యంలో .. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి నేటి ఉదయం .భీమవరం ఏ ఎస్ ఆర్ నగర్ లోని దేశ ఖ్యాతి గాంచిన 35 అడుగుల అల్లూరి సీతారామ రాజు కాంస్య విగ్రహం వద్ద ఘన నివాళ్లు అర్పించారు. అక్కడ పార్కులో డిజిటల్ స్క్రీన్ ను ఆవిష్కరించారు.‘నా దేశం, నా ప్రజలు పరాయి పాలనలో ఉండటం సిగ్గు చేటని,భావించి విల్లంబులతో ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన అల్లూరి చిరస్మరణీయుడని’ అన్నారు. చిన్నారులు ప్రముఖ దేశభక్తుల వేషధారణలో అలరించారు. భీమవరంలో పలు ప్రాంతాలలో అల్లూరి విగ్రహాలకు ముఖ్యంగా ప్రకాశం చౌక్ లోను, నర్సయ్య అగ్రహారం మరియు ఇక్కడికి సమీపంలోని అల్లూరి .. స్వగ్రామం మోగల్లులోను పలుచోట్ల అల్లూరి.. విగ్రహాలకు పుష్ప మాలలు వేసి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ , స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు స్థానికులు, ప్రముఖులు ఘన నివాళ్లు అర్పించారు. అల్లూరి సీతారామరాజు యువజన సంఘం, జిల్లా సిపిఐ పార్టీ మరియు ప్రజా నాట్యమండలి అధ్వర్యంలో అల్లూరి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమవరం పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మరియు సిబ్బంది అల్లూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది
