సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని గోదావరి జిల్లాల మధ్య పకృతి అందాల నడుమ గలగలాపారే గోదారమ్మ విహార యాత్ర అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకే విరామం ముగించి . పాపికొండలు విహారయాత్రకు అధికారులు నేడు, శనివారం పచ్చజెండా ఊపారు. ఇరవై రోజుల తర్వాత అనుమతులు మంజూరు చేశారు. నూతన పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోశమ్మ ఆలయం నుంచి బయలుదేరేందుకు 15 ప్రైవేట్ బోట్లు, ఒక ఏపీటీడీసీ బోటు సిద్ధమయ్యాయి. గత నెల 14న పోశమ్మగండి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఓ పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ప్రెవేటు బోట్లలో స్టీమర్లు లలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకొన్న తరువాత అనుమతి లభించింది.
