సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ మంచి ఊపుమీద ఉంది.. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టార్ భారీ లాభాలు ఆర్జించనుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలోగత సెషన్లో విదేశీ మదుపర్లు రూ.1355 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. తాజగా ఓపైక్ అదనపు చమురు ఉత్పత్తికి ముందుకు రావడంతో బ్రెంట్ చమురు ధర 71-50 కి పడిపోయింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).గత సెషన్ ముగింపు (77,138)తో పోల్చుకుంటే నేటి సోమవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తోంది.నేటి సాయంత్రం 521 పాయింట్స్ లాభాలు సాధించి 78,285 వద్ద స్థిరపడింది.. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 159 పాయింట్ల లాభంతో 24, 430 పాయింట్ వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.26గా ఉంది .
