సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం బంగారమ్మపేట గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడిఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన బసవాని లక్ష్మణ్‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు.. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు,దగ్గర బంధువు అయిన నిందితుడు వరుసకు అన్నాచెల్లెలు అవుతారని సమాచారం.ఈ ఘటన అనంతరం బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలికను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నేడు, మంగళవారం ప్తకటించారు. . ఈ ఘటనపై పోలీసులు పోక్సోతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
