సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. గతంలో ప్రత్యేక కోర్టు 2022లో విధించిన శిక్షలను సమర్థిస్తూ ఈ ‘మహా అరాచకం’లో భాగస్వామ్యులు అయిన’38 మంది దోషులకు’ ఉరిశిక్షను, మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు నేడు ,మంగళవారం ఖరారు చేసింది. 2008, జులై 26న అహ్మదాబాద్‌లో కేవలం 70 నిమిషాల వ్యవధిలో 21 చోట్ల బాంబు దాడులతో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో 56 మంది మరణించగా, 246 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ తర్వాత సూరత్‌లో పేలని బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 78 మందిపై విచారణ జరగగా, 2022లో ప్రత్యేక కోర్టు 49 మందిని దోషులుగా తేల్చి, 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. నిషేధిత ఇండియన్ ముజాహిదీన్ (IM), సిమి (SIMI) ఉగ్రవాద సంస్థల కుట్రను ప్రాసిక్యూషన్ నిరూపించగలిగింది. దేశద్రోహం, హత్య నేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ‘ఉపా’ (UAPA) కింద దోషులుగా న్యాయస్థానం తేల్చింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *