సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ఏపీ మంత్రి నారాయణ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించారు. అక్కడ గోదావరి పుష్కర ఏర్పాట్లును పరిశీలించారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. మంత్రి నారాయణ వెంట ఎమ్మెల్యే నాయకర్, ప్రజాప్రతినిధులు,అధికారులు ఉన్నారు. అనంతరం నర్సాపురం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఈ ఎన్నికలు జరపడానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. గోదావరి పుష్కరాలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 10 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసిందని తెలిపారు. గత పుష్కరాలకు నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చారని పేర్కొన్నారు.ఇప్పటివరకు మున్సిపల్ శాఖకు పుష్కర అభివృద్ధి పనుల నిమిత్తం రూ.150 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. పుష్కరాల నాటికి రోడ్లు, డ్రైన్‌లు, పార్కులు పూర్తి చేయాలని. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా నర్సాపురం మున్సిపాలిటీకి రూ.34 కోట్లు కేటాయించామని ప్రస్తావించారు.
