సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ పట్నంలో గల్లంతయిన మత్యకార కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు వైసీపీ శ్రేణులు భారీగా ఎత్తున తరలి వచ్చి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. జబ్బార్ తోటలోని మత్యకార కుటుంబాలను కలసి పరామర్శించి వారికీ అండగా ఉంటానని ప్రకటించారు. తదుపరి మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. ఈనెల1 న వారు వేటకు వెళ్లారు. తిరిగి వాస్తు 4వ తేదీన మత్యకారులు తమ కుటుంబ సబ్యులకు ఫోన్ చేసి తీరానికి కేవలం 10 కిమీ దూరంలో ఉన్నామని, కష్టంగా ఉందని చెప్పారని , కాసేపటికే బోటు ప్రమాదం జరిగింది. ఫిషరీస్ అధికారులు కూడా పట్టించుకోలేదని, గల్లంతయిన వారి ఆచూకీ ఇప్పటికి తెలియలేదని ఈ నిర్లక్ష్యం ఫై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఎందుకు స్వాదించ లేదని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ కు మెసేజ్ లు పెట్టిన పట్టించుకోలేదు. వెంటనే స్వాదించి ఉంటె వారు దొరికేవారు .. మనుష్యుల ప్రాణాలపై చంద్రబాబు సర్కా ర్కు మానవత్వం ఉందా? అని : వైఎస్ జగన్ ప్రశ్నించారు. అనర్ధం జరిగాకే త్రీమెన్ కమిటీ వేశారు . త్రీమెన్ కమిటీ నివేదిక అంతా తప్పుల తడక. బాధితులను ఫిషరీష్ మంత్రి కూడా పరామర్శించలేదు ఎక్స్గ్రేషియా కింద అరకొర సాయం చేశారు .ఏడుగురు మత్స్య కారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 1.కోటి చొప్ప న ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. అని డిమాండ్ చేసారు జగన్. ఏపీలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు . ప్రభుత్వ స్కూల్ పిల్లలకు బుక్స్, యూనిఫాంలు లేవు. రాష్ట్రంలో రైతు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. అని జగన్ ఆరోపణలు చేసారు.రేపు బుధవారం జగన్ భీమవరం పర్యటనకు రానున్నారు. పట్టణం అంతటా వైసీపీ జెండాలు ఫ్లెక్సీలతో సందడిగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *