సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ నుండి వేలాది కోట్ల ఆక్వా ఎగుమతులకు రాజధానిగా పేరున్న భీమవరంలో రాష్ట్ర ఆక్వా రైతుల సమస్యలు విని వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి భీమవరం పర్యటనకు వచ్చిన మాజీ సీఎం వైసీపీ అధినేత, జగన్ పర్యటన కనివిని ఎరుగని రీతిలో విజయవంతం అయ్యింది. హెలికాఫ్టర్ లో భీమవరం వచ్చిన జగన్ ఎర్రటి ఎండలో పట్టణ వీధుల గుండా కాన్వాయి లో ప్రయాణిస్తుంటే వైసీపీ శ్రేణులతో పాటు ఎక్కడ చుసిన వేలాది జనంతో పట్టణం కిక్కిరిసిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జగన్ కు మరింత ఘనస్వాగతం లభించింది. ఉండి రోడ్డు లోని వేదిక వద్ద కూడా ఇదే కోలాహలం. ఒక దశలో జగన్ వేదిక పైకి చేరుకోవడానికి వేలాది మంది జనం, వైసీపీ అభిమానులు, రైతులు మధ్య నలిగిపోవలసి వచ్చింది. పోలీసులు తమ వంతు ఎంతో శ్రమించారు. చివరకు వేదిక ఫై కూడా అభిమానుల ప్రతాపానికి జగన్ క్రింద పడినంత పని అయ్యింది. అయిన చిరునవ్వుతో తేరుకొని అక్కడ పందిరిపీకి పండుగ చేస్తున్న అభిమానులను వారిస్తూ అభివాదం చేసారు. తదుపరి జగన్ మాట్లాడుతూ.. భీమవరం .. భీమవరం అంటూ ఉత్సహపరుస్తూ.. ఏమిటండి.. మీ అభిమానం ఎక్కడ చుసిన అదే జనం.. ఇక్కడ కూడా కనుచూపు జనం.. నాకు భావోద్వేగం లో మాటలు రావడం లేదు అని హర్షం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కూటమి పాలన లోఆక్వా తో పాటు వ్యవసాయ రైతాంగం తీవ్ర అవస్థలు పడుతుందని.. నేను విన్నాను .. నేను ఉన్నాను..అంటూ జగన్ భరోసా ఇచ్చారు.
