సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నీట్ పరీక్షలలో ప్రశ్న పత్రాల లీకేజి లో జరిగిన అవినీతి, దోషులు బయటకు రావాలని దీనికి భాజ్యత వహిస్తూ కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 21 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు ‘సోనమ్‌ వాంగ్‌చుక్‌ దేశ ప్రజలు దృష్టిని మొత్తం ఆకర్షించాడు. జూన్ 28వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. నేటి, శనివారం నాటికి ఆమరణ నిరాహార దీక్ష 21వ రోజుకు చేరుకుంది. సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఆరోగ్యం తీవ్రంగా కృశిస్తోందని,అతనిని రక్షించాలని ఢిల్లీ కోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు నేటి శనివారం ఉదయం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం వద్దకు వెళ్లారు. బలవంతంగా అక్కడినుంచి ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ తరలింపు ను అడ్డుకొన్న కాక్రోచ్ జనతా పార్టీ అడ్జక్షుడు అభిజిత్ పోలీసులు తనను కొట్టి అదుపులోకి తీసుకొన్నారని,, వాంగ్ ఛుక్ ను ఈడుచుకొని వెళ్లారని తమ విద్యార్థులపై పై పోలీసులు దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *