సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో మునిసిపల్ ఎన్నికలు వచ్చే సెప్టెంబర్ లో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయి కూటమి పార్టీల నేతలలో అలజడి మొదలయింది. కారణాలు ఏవైనా దశాబ్దం పైగా ఎన్నికలకు దూరంగా ఉన్న భీమవరం మునిసిపాలిటీల్లో ఈసారి ఎన్నికలు జరుగనున్నాయి,రాజకీయం వేడెక్కుతోంది. ఇటీవల టీడీపీ మంత్రి లోకేష్ టీడీపీ నేతలకు మొత్తం 4వంతులలో 3వంతుల స్థానాలకు సీట్లు ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించడంతో టీడీపీ వర్గాలలో హర్షం వ్యక్తం అవుతుంది. భీమవరం లాంటి జిల్లా మరియు రాష్ట్రము రాజకీయాలను చక్రం త్రిప్పే ‘కీలక నియోజకవర్గం’లో కూటమి పొత్తుల పుణ్యమా? అని ‘టీడీపీ కి ఎంపీ లేదా రాజ్యసభ సీటు కాదు కదా కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా లేకుండా పోయింది. బీజేపీ కి అయితే ఏకంగా ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరు ఎంపీ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మరొకరు రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ.. ఇక ప్రతిపక్ష వైసీపీ కి కూడా ఇప్పటికి ఇద్దరు ఎమ్మెల్సీ లు ఉన్నారు. వారిలో ఒకరు ఏకంగా రాష్ట్ర శాసన మండలి చైర్మెన్ మోషేను రాజు, మరొకరు కవూరు శ్రీనివాస్. లెఫ్ట్ పార్టీలకు కూడా టీచర్లు స్తానం నుండి ఎమ్మెల్సీ మూర్తి మాస్టారు ఉన్నారు. ఉన్నంతలో భీమవరంలో అవిభక్తంగా కలసిపోయిన ఉండీ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు టీడీపీ ఎమ్మెల్యే గా తన ప్రాభవాన్ని చూపిస్తున్నారు. ఇదొక్కటే పరోక్షంగా కాస్త ఉపశమనం. ఇక గతంలో భీమవరం మునిసిపల్ చైర్మెన్ గా, తదుపరి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన తోట సీతారామ లక్ష్మి మరియు ఉమ్మడి జిల్లాకు 4 సార్లు టీడీపీ అడ్జక్షునిగా పనిచేసిన మెంటే పార్ధ సారధి వంటి సీనియర్ నేతల పర్యవేక్షణలో టీడీపీ పార్టీ కి ఎట్టి పరిస్థితిలో ఈసారి భీమవరం మునిసిపల్ చైర్మెన్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులను పెద్ద ఎత్తున నిలబెట్టాలని కసరత్తు చేస్తున్నారు. మరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అడ్జక్షుడు కొటికలపూడి గోవిందరావు కూడా పార్టీ ప్రతిష్టాత కు భీమవరం మునిసిపల్ చైర్మెన్ స్తానం మరియు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎన్నికల్లో సత్తా చూపించాలని భావిస్తున్నారు. మరి బీజేపీ అయితే రాష్ట్రము లోనే తమకు ఎన్నో దశాబ్దాలుగా అద్భుతాలు చేసిన ప్రతిష్టాకర స్థానంగా భీమవరం’ భావిస్తుంది.వారి క్యాడర్ కు స్థానిక సంస్థలలో పట్టు కావలసిందే.. ఇక ఇటీవల ‘జగన్’ రాకతో భీమవరంలో అద్భుత స్వాందన నేపథ్యంలో వైసీపీ పార్టీ కూడా హోరాహోరీ పోరాటానికి స్థానిక సంస్థలకు బలమైన అభ్యర్థులను సిద్ధం చేసుకొంటుంది. మరి రాజకీయాలకు దూరంగా ఉన్న మాస్ లీడర్ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్యూహం ఏమిటో? వారి ‘వారసులు’ సంచలన ఆగమనం ఉంటుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *