సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ మరియు పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి Dr. B. లక్ష్మీనారాయణ నేడు, శనివారం స్ధానిక ప్రత్యేక ఉపకారాగారాన్ని సందర్శించి ముద్దాయిలతో మాట్లాడి కేసు వివరాలను, ముద్దాయిల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముద్దాయిలు సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలన్నారు. ముద్దాయిలు జైలులో సిబ్బందినిగానీ, తోటి ముద్దాయిలను గానీ ఇబ్బందులు కలిగించినట్లు కోర్టు దృష్టికి వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా జైలు సిబ్బంది కూడా ముద్దాయిలను మంచిగా చూసుకోవాలన్నారు. ఉచిత న్యాయవాది అవసరమైతే సంస్ధకు అర్జీ పెట్టమన్నారు. జైలులో వున్న న్యాయ సహాయ కేంద్రాన్ని పరిశీలించి ముద్దాయిలకు కేసుపరంగా సలహాలు ఇచ్చి అవసరమైతే అర్జీలు వ్రాయమని ఉచిత న్యాయవాదిని సూచించారు. ముద్దాయిలకు ఇస్తున్న సాయంత్ర భోజనాన్ని రుచి చూసారు. పప్పు దినుసులు చూసి మంచి క్వాలిటీ కందిపప్పును సప్లయ్ చేయమని కాంట్రాక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తితో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి యోహాన్ (న్యూటన్), జైలు సూపరింటెండెంట్ D. వెంకటగిరి, ప్యానల్ న్యాయవాదులు అంబేద్కర్, వెంకటరమణ, లోకేశ్వరరావు, జ్యోతి, భాగ్యశ్రీ, సునీత, ఉష, మహిమా జ్యోతి, అమూల్య, హర్షవర్ధన్, పారా లీగల్ వాలంటీర్లు సుధామ, జానకీరామ్, నాగేంద్ర కుమార్, జైలు సిబ్బంది పాల్గొన్నారు
