సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా. ఉండి నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పీవీఎల్ నరసింహారాజు నేటి శుక్రవారం సాయంత్రం రాజీనామా చేస్తున్నట్లు, మీడియా సమావేశానికి ఏర్పాటు చేసినట్లు అధికారిక సమాచారం. వైసీపీ పార్టీలో ఆవిర్భం నుండి కీలక నేతగా కొనసాగిన నరసింహారాజు గత 2 పర్యాయాలు ఉండి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ జగన్ సీఎంగా అధికారంలో ఉన్నపుడు పశ్చిమ గోదావరి జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా కీలక పదవిలో పనిచేసారు. అయితే ఇటీవల ఆయనను తప్పించి వైసీపీ అధిష్ఠానం ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్‌ను నియమించింది. అదే సమయంలో పీవీఎల్ నరసింహారాజును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించింది. అయితే నరసింహారాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *