సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడికి దిగిన నేపథ్యంలో, దానికి ప్రతికారంగా యూఎస్ మిలిటరీ ఇరాన్‌లోని లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది. చర్చలకు అవకాశం ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత శుక్రవారం నుండి దాడులు నిలిపివేసిన తర్వాత ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం.జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఐదు బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో.. అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణులన్నింటినీ విజయవంతంగా కూల్చివేశాయి. అయితే ఇప్పుడు తమ దళాలపై జరిగిన ఈ దాడికి ప్రతికారంగా అమెరికా ఈ దాడులకు దిగింది. ఇరాన్ లోని రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించారు. ఇరాన్‌లోని ఖుజెస్తాన్ ప్రావిన్స్, బుషెహర్, హోర్ముజ్ జలసంధిలోని ‘ఖెష్మ్’ ఐలాండ్ పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *