సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని పవిత్ర పంచారామ పుణ్యక్షేత్రం, శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం గునుపూడి నందు పౌర్ణమి నేపథ్యంలో శ్వేతా రూపంలోకి మరీన శ్రీ సోమేశ్వరునికి శాఖంబరుని అవతారంలో పండ్లు, కాయగూరలు ఆకూ కూరలు పుష్పాలు తో అద్భుతమైన అలంకరణ చేసారు. భక్తులు విశేషంగా శ్రీ స్వామిని దర్శించుకొంటున్నారు. గత బుధవారం సాయంత్రం లకు దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ గారు సభ్యులు మరియు భక్తుల సమక్షంలో 2026- 2027 మరియు 2027 -2028 సంవత్సరముల కాలమునకు భక్తులచే శ్రీ స్వామివారికి సమర్పించే కొబ్బరికాయలలో సగం చెక్క భక్తులు తీసుకోని పోగా మిగిలిన సగం కొబ్బరి చెక్కలను ప్రోగు చేసుకొనుటకు బహిరంగ వేలం నిర్వహించగా హెచ్చుపాటకు శ్రీ నారిన లక్ష్మీ శివ సాయి సీతారాం , ఏనుగు లంక వారు హెచ్చు పాటకుమొదటి సంవత్సరం నకు రూ 17,05,000/- రూపాయలకుకొబ్బరి చెక్కలు ప్రోగు చేసుకొనులైసెన్సుహక్కునకు పాడుకొని ఉన్నారని ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు మరియు చైర్మన్ చింతలపాటి బంగార్రాజు పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వాహణాధికారి డి రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
