సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు నేడు, గురువారం ఉదయం వైసీపీ కార్యకర్తలు ఘన స్వగతం కెలికారు. అక్కడినుండి శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడిని ములాఖత్‌లో కలిసేందుకు వెళుతున్న జగన్ కు దారి పొడవునా ఎక్కడ చుసిన వేలాది జనం తరలి వచ్చి అభివాదాలు, కొందరు నేతలు తమ ప్రాంత సమస్యలతో విన్నతి పత్రాలు ఇవ్వడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జైలుకు గంటల తరబడి ఆలస్యం అయ్యి ( మధ్యాహ్నం 2 గంటల కల్లా చేరుకోవాలి) సాయంత్రానికి కానీ చేరుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. జగన్ ను రోడ్‌ షోలు నిర్వహించవద్దంటూ జైలుకు వెళ్లి అప్పలరాజును కలిసి వెళ్లిపోయేందుకు మాత్రమే పోలీసులు అంగీకరించారు. అయితే వైసీపీ కార్యకర్తలు మాత్రం పోలీసుల ఆంక్షలను పక్కనపెట్టేశారు. పెద్ద ఎత్తున జనసమీకరణ చేశారు. జైలుకు అత్యంత సమీపంలో కిలోమీటరు ముందుగానే బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే, ఎక్కడ చుసిన జనమే జనం.. వైసీపీ అభిమానులు జెండాలే.. అంపోలు జంక్షన్ వద్ద ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి ని పోలీసులు అడ్డుకొన్నారు. దీనితో వారితో వాదులాట జరిగింది. ఇక వైసీపీ మాజీ మంత్రి ధర్మానప్రసాద్ రావు కుమారుడు రామ్‌మనోహర్.. భారీగా కార్యకర్తలతో జైలు సమీపంలోకి తరలివచ్చారు. దీనితో . వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. లాఠీఛార్జి చేసి వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. జిల్లాలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో ఆ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళా ఎస్‌ఐ కు ఆముదాలవలస ఇన్‌ఛార్జి చింతాడ రవి కుమార్ మధ్య త్రోపులాట జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *